టీడీపీ ఒంటరి రికార్డ్

|

Mar 22, 2019 | 7:16 AM

విజయవాడ: ఈసారి ఎన్నికల పోరులో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కోబోతోంది. అయితే ఇది టీడీపీ చరిత్రలో ఒక రికార్డ్. ఈ విధంగా ఒంటరిగా బరిలోకి దిగడం టీడీపీకి గత 37 ఏళ్లలో ఇదే ప్రధమం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఇతర కొన్ని పార్టీలతో పొత్తు కొనసాగిస్తున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి పొత్తు లేదు. 1983లో పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 ఎన్నికల వరకూ ఏదో రకంగా పొత్తు నడిచింది. 1983లో […]

టీడీపీ ఒంటరి రికార్డ్
Follow us on

విజయవాడ: ఈసారి ఎన్నికల పోరులో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికలను ఎదుర్కోబోతోంది. అయితే ఇది టీడీపీ చరిత్రలో ఒక రికార్డ్. ఈ విధంగా ఒంటరిగా బరిలోకి దిగడం టీడీపీకి గత 37 ఏళ్లలో ఇదే ప్రధమం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ఇతర కొన్ని పార్టీలతో పొత్తు కొనసాగిస్తున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి పొత్తు లేదు.

1983లో పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 ఎన్నికల వరకూ ఏదో రకంగా పొత్తు నడిచింది. 1983లో మేనకా గాంధీ స్థాపించిన సంజయ్ విచార్ మంచ్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడగా, బీజేపీతో కలిసి తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ సాధించింది. దీంతో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, 2019లో పరిస్థితి మారింది. టీడీపీకి ఒంటరి పోరు తప్పలేదు. ఏపీలో ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమాగా ఉన్నాయి.