వైసీపీ అభ్యర్థులపై ఎందుకు దాడులు జరగడం లేదు

వైసీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదంటూ టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. ఓడిపోతారనే భయంతోనే టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని కనకమేడల పేర్కొన్నారు. సాధారణ దాడులు అని చెబుతూ.. టీడీపీ అభ్యర్థులనే టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు. కాగా ఐటీ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఇవాళ నిరసనకు […]

వైసీపీ అభ్యర్థులపై ఎందుకు దాడులు జరగడం లేదు

Edited By:

Updated on: Apr 05, 2019 | 1:04 PM

వైసీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదంటూ టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. ఓడిపోతారనే భయంతోనే టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని కనకమేడల పేర్కొన్నారు. సాధారణ దాడులు అని చెబుతూ.. టీడీపీ అభ్యర్థులనే టార్గెట్ చేశారని ఆయన మండిపడ్డారు. కాగా ఐటీ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఇవాళ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.