Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరంటే? ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారన్న అంశంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Telangana: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరంటే? ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
MP Komatireddy Venkat Reddy (File Photo)

Updated on: Aug 26, 2021 | 6:00 PM

Komatireddy Venkat Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరవుతారన్న అంశంపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. రాంపూర్ తండా దళిత – గిరిజన దండోరా దీక్షలో పాల్గొన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి  ఈ వ్యాఖ్యలు చేశారు.  పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి దక్కించుకోవడంతో ఆ పదవిని ఆశించిన ఎంపీ కోమటిరెడ్డి..ఇప్పుడు సీఎం పదవిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

అటు దళిత బంధుతో సీఎం కేసీఆర్ పతనం తథ్యమని ఆయన వ్యాఖ్యానించారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి పది లక్షలు ఇస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. అలా చేస్తే తాను మళ్లీ పోటీ చేయనని.. కేసీఆర్ కూతురు కవిత కు టికెట్ ఇస్తే ఆమెను  గెలిపిస్తా అన్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చిన అడ్డుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎంఓలో రాహుల్ బొజ్జాకు పదవి ఇస్తే..దళితలందరికి ఇచ్చినట్టా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన ఎవరు టీఆర్ఎస్‌కు ఓటు వేయరని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలేకనే కొకపేట భూములు అమ్మారని ఆరోపించారు. తన మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు, నలుగురు వెలమలకు చోటు ఇచ్చిన  కేసీఆర్.. ఒక్క దళితుడికి చోటు ఇవ్వలేదని విమర్శించారు.

పీసీసీ చీఫ్ పదవి దక్కకపోవడంతో అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన కోమటిరెడ్డి ఆ తర్వాత శాంతించారు. పార్టీ పటిష్టతే లక్ష్యమని, కొత్త పీసీసీ సారథి రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల స్పష్టంచేశారు.

Also Read..

అసహనంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.. ఈటలపై మంత్రి హరీష్ రావు మండిపాటు

మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…