విజయవాడ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను పట్టుకుంటామని టీడీపీ అధికారిక ప్రతినిధి బుద్ధా వెంకన్న అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మొన్నటి వరకూ తనను సీబీఐ కేసుల్లో ఇరికించారన్న జగన్ ఈరోజు అదే సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నారని విమర్శించారు.
జగన్, మోడీల మధ్య లాలూచీ రాజకీయాలు ఉన్నయనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని అన్నారు. విశాఖలో జగన్‌పై జరిగిన దాడి కేసు, గుంటూరు జిల్లా కొండవీడు కోట ఉత్స వాల సమయంలో రైతు ఆత్మహత్యను ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే జగన్ చూస్తారని విమర్శించారు.