14 నెలలు మనసు చంపుకొని టీడీపీలో పనిచేశా: వాసుపల్లి

14 నెలలు మనసు చంపుకొని టీడీపీలో పనిచేశానని విశాఖ సౌతమ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. టీడీపీ అధికారంలో

14 నెలలు మనసు చంపుకొని టీడీపీలో పనిచేశా: వాసుపల్లి

Edited By:

Updated on: Sep 23, 2020 | 3:01 PM

Vasupalli Ganesh news: 14 నెలలు మనసు చంపుకొని టీడీపీలో పనిచేశానని విశాఖ సౌతమ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు వైఎస్ జగన్ పాలనలో జరుగుతున్నాయని, ఏపీలో సముద్రమంత మార్పు ఇప్పుడు కనిపిస్తోందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని.. 14 నెలల్లో 59 వేల కోట్లు ప్రజాసంక్షేమానికి ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ఆయన ప్రశంసించారు.

ఇక ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక సూచన చేయాలని, కానీ రాష్ట్రంలో అది జరగడం లేదని గణేష్ విమర్శించారు. పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు.. ప్రతిపక్ష పార్టీగా పేదవాడి నోట్లో మట్టి కొట్టొద్దని ఆయన సూచించారు. టీడీపీ హయాంలో సూటు బూటు వేసుకున్న వారికే పనులు జరిగాయని ఆయన తూర్పారబట్టారు. అభివృద్ధికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ సూచించినట్లు గణేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ లేదని జోస్యం చెప్పారు.

టీడీపీలో ఉన్నప్పుడు మనసు చంపుకొని పార్టీ ఆదేశాల మేరకు జగన్‌పై విమర్శలు చేశానని తెలిపారు. టీడీపీలో ఉండలేకపోయానని.. ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా తను సిద్ధమని వివరించారు. తనపై అనర్హత ఫిర్యాదు చేసుకోవచ్చు అంటూ వ్యాఖ్యలు చేశారు. విశాఖను పరిపాలన రాజధాని ప్రకటించిన రోజే తాను స్వాగతించానని.. అమరావతికి మద్దతు ఇస్తున్నట్లు తనకు తెలియకుండా లేఖ విడుదల చేశారని ఫైర్ అయ్యారు. తాను పార్టీ ద్రోహిని అయితే చంద్రబాబు పేదల ద్రోహి అని గణేష్ మండిపడ్డారు.

Read More:

రియాకు మరో షాక్‌.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

రేణు దేశాయ్‌ వెబ్ సిరీస్‌కి ఆసక్తికర టైటిల్‌