Vakeel Saab: ‘వకీల్ సాబ్’కు మళ్లీ షాక్.. టికెట్ ధరలపై మరోసారి హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం.!

Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అధికార వైసీపీ, బీజేపీ నేతల..

Vakeel Saab: వకీల్ సాబ్కు మళ్లీ  షాక్.. టికెట్ ధరలపై మరోసారి హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం.!
Vakeel Saab

Updated on: Apr 10, 2021 | 11:06 AM

Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అధికార వైసీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ తరుణంలో తాజాగా ‘వకీల్ సాబ్’కు మరో షాక్ తగిలింది. మూడు రోజులు టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈరోజు దాఖలు చేయబోతున్నారని తెలుస్తోంది.

కాగా, వాస్తవానికి కరోనా తర్వాత విడుదలైన కొన్ని సినిమాల టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు ఇటీవల ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి థియేటర్ యజమానులు బయటపడేందుకు రెండు రోజుల కిందట.. ఏపీ సర్కార్ ఓ ప్యాకేజీని సైతం ప్రకటించింది. టిక్కెట్ రేట్లు.. బెనిఫిట్ షోల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని అనుకున్నారు. కానీ వకీల్ సాబ్ విషయంలో అలా జరగలేదు.

తొలి రెండు వారాల పాటు టికెట్ ధరలను పెంచుకోవచ్చునన్న ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచలేదు. వకీల్ సాబ్ టికెట్ ధరలను పెంచకుండా జేసీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో జేసీ ఉత్తర్వులపై కోర్టు ధిక్కరణ చర్యల తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెరుగుదలపై ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీనిపై పవన్ ఫ్యాన్స్‌తో పాటు జనసేన, బీజేపీ నేతలు మండిపడ్డారు.

Also Read:

Viral: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.

ఆ గ్రామంలో నివసించాలనుకునే వారికి ఇల్లు, కారు ఫ్రీ.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుద్దోడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!