అద్వాణి ఎన్నికల్లో పోటీపై ఉమాభారతి స్ఫందన

|

Mar 22, 2019 | 7:41 PM

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్‌కే అద్వాణి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  దీంతో అద్వాణీని పార్టీ పక్కనపెట్టిందనే విమర్శలు రావడంతో  ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఉమాభారతి స్పందించారు. ‘ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు అద్వానీజీ గతంలోనే చెప్పార’ ని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయెద్దని ఆవిడ సూచించారు. తొలి జాబితాలో ప్రధాని […]

అద్వాణి ఎన్నికల్లో పోటీపై ఉమాభారతి స్ఫందన
Follow us on

న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్‌కే అద్వాణి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  దీంతో అద్వాణీని పార్టీ పక్కనపెట్టిందనే విమర్శలు రావడంతో  ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఉమాభారతి స్పందించారు. ‘ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు అద్వానీజీ గతంలోనే చెప్పార’ ని ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని రాద్ధాంతం చేయెద్దని ఆవిడ సూచించారు.

తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు సీనియర్‌ నేతలకు చోటుదక్కింది. కాగా ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో ఈ విషయం విసృతంగా సర్కులేట్ అవుతుంది. మరి దీనిపై ప్రధాని మోదీ, అమిత్ షా ఎలా స్పందిస్తారో చూాడాలి.