తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లో మనసువిప్పి మాట్లాడారు. “నా మీద మా నాయకుల్లో ఒక అలిగేషన్ ఉంది. ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గరికి వచ్చి పని చేసుకుంటారనే భావన అందరిలో ఉంది. అది నా బలహీనత.. ఎవరైన దుఃఖం తో నా దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉందని చెబితే భరించే శక్తి నాకు లేదు. అందుకే వారికి సహాయం చేసి పంపుతా.” అంటూ ఈటెల అన్నారు. లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకున్నా అంటే.. అది నా కార్యకర్తలకు ఉన్న కమిట్ మెంట్ చూసి మాత్రమే అని ఆయన అన్నారు.
“ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్లు, రేషన్ కార్డులు క్లియర్ చేశారు.. మిగిలింది మీ జాగల్లో ఇల్లు కట్టుకునేలా చేయడం ఒకటే ఉంది. త్వరలో అందరు అవసరాలు తీర్చే ఇండ్లు అందరికీ వస్తాయి. ఎన్ని ఇండ్లు, ఎన్ని గుడిసెలు ఉన్నాయని మేము ఒక సర్వే చేశాం. 3500 ఇండ్లు మంజూరు చేశాం. కాని కొన్ని సమస్యల వల్ల జాప్యం జరిగింది. ఇకపై అలా జరుగవు. అన్ని గ్రామాల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం.” అని ఈటెల అన్నారు.
Read also : తల్లిదండ్రుల పేదరికం.. మోయలేని ఫీజుల భారం, స్కూల్ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకున్న పదో తరగతి బాలిక