టీఆర్ఎస్‌కు టీడీపీ గతే.. విజయశాంతి జోస్యం..

| Edited By:

Jun 21, 2019 | 11:16 AM

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కి పడుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఆమె.. ప్రస్తుతం దేశంలోని పార్టీ మార్పు దిశగా పయనిస్తోందని.. రాజకీయ నాయకులు పార్టీలను మారుతున్న సమస్యలకు కొన్ని పార్టీల వైఖరే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. ‘నేతలందరూ పార్టీ మారుతున్నారంటే అది ఆ పార్టీ తప్పిదమే. సిద్ధాంత విధానాల కోసం ఉన్న కార్యకర్తలకు బదులుగా, వ్యాపార నిర్భంధాలు ఉన్న పెద్దలకు కీలక పదవులు ఇవ్వడం వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నాయి. […]

టీఆర్ఎస్‌కు టీడీపీ గతే.. విజయశాంతి జోస్యం..
Follow us on

టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్‌కి పడుతుందని అన్నారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఆమె.. ప్రస్తుతం దేశంలోని పార్టీ మార్పు దిశగా పయనిస్తోందని.. రాజకీయ నాయకులు పార్టీలను మారుతున్న సమస్యలకు కొన్ని పార్టీల వైఖరే కారణమని ఆమె వ్యాఖ్యానించారు.

‘నేతలందరూ పార్టీ మారుతున్నారంటే అది ఆ పార్టీ తప్పిదమే. సిద్ధాంత విధానాల కోసం ఉన్న కార్యకర్తలకు బదులుగా, వ్యాపార నిర్భంధాలు ఉన్న పెద్దలకు కీలక పదవులు ఇవ్వడం వల్లనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నాయి. టీఆర్ఎస్, టీడీపీ కూడా ఈ స్థితిని పోషిస్తూ వచ్చాయి. రెండు, మూడు తరాల నుండి డీఎంకే, అన్నాడీఎంకేలు అనుసరిస్తున్న ఈ గుణాత్మక రాజకీయ విధానాన్ని అర్థం చేసుకోకుండా.. ఆ సాంస్కృతిక, సమున్నత ప్రాంతీయ ఆత్మగౌరవ వ్యవస్థను నిర్మించకుండా డీఎంకే, అన్నాడీఎంకే అనుకుంటూ కేవలం ప్రసంగాలతో కేసీఆర్ వ్యవహరిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీకి పట్టిన గతే.. రేపు టీఆర్ఎస్‌కు పడుతుందని.. ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.