మంగళగిరి బరిలో ట్రాన్స్‌జెండర్

| Edited By: Pardhasaradhi Peri

Mar 27, 2019 | 7:28 AM

ఏపీ ఎన్నికల్లో మంగళగరి నుంచి థర్డ్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు. అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటి థర్డ్ జెండర్‌గా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు. మంగళగిరి టికెట్ కోసం జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు తమన్నా చెప్పారు. ఆ పార్టీ తనకు గుర్తింపు ఇవ్వలేదని.. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపై మంగళగిరిలోనే ఉంటానని.. […]

మంగళగిరి బరిలో ట్రాన్స్‌జెండర్
Follow us on

ఏపీ ఎన్నికల్లో మంగళగరి నుంచి థర్డ్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు. అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటి థర్డ్ జెండర్‌గా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు.

మంగళగిరి టికెట్ కోసం జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు తమన్నా చెప్పారు. ఆ పార్టీ తనకు గుర్తింపు ఇవ్వలేదని.. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపై మంగళగిరిలోనే ఉంటానని.. ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానంటున్నారు. ఇటు మంత్రి లోకేష్‌కు తమన్నా సవాల్ విసిరారు. లోకేష్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. నారా లోకేష్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.