Revanth Reddy: సీనియర్లను కలుస్తున్న కొత్త పీసీసీ చీఫ్.. పొన్నాలతోపాటు వీహెచ్ కలవనున్న రేవంత్ రెడ్డి

|

Jun 28, 2021 | 10:41 AM

టీపీసీసీ కొత్త చీఫ్‌గా నియామకం అయిన రేవంత్ రెడ్డి తనదైన ఏజెండాతో ముందుకువెళ్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు

Revanth Reddy: సీనియర్లను కలుస్తున్న కొత్త పీసీసీ చీఫ్.. పొన్నాలతోపాటు వీహెచ్ కలవనున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy
Follow us on

టీపీసీసీ కొత్త చీఫ్‌గా నియామకం అయిన రేవంత్ రెడ్డి తనదైన ఏజెండాతో ముందుకువెళ్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశం అయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా ఆయన పేరు ప్రకటించిన వెంటనే.. జానారెడ్డితో కలిశారు. ఆ తర్వాత షబ్బిర్ అలీతో కూడా సమావేశం అయ్యారు. మరికొందరు సీనియర్ నేతల్ని కలిసి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలపనున్నారు.

అయితే వరసగా సీనియర్స్ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతున్న కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ రోజు మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను జూబ్లీహిల్స్‌లోని పొన్నాల నివాసంలో మర్యాద పూర్వకంగా కలుస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావును కలిసి పరామర్శిస్తారు. అక్కడ నుంచి పివి ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పిస్తారు.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అస్వస్థతకు  అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కొద్ది కాలంగా వి. హనుమంతురావు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి: తొలకరి వచ్చింది.. వజ్రం దొరికింది.. జొన్నగిరి కూలిని లక్షాధికారిని చేసింది..

T.Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ మంటలు.. నిప్పులు చెరుగుతున్న సీనియర్ నేతలు