మాకేం ఢోకా లేదు… బీజేపీ అలా కలలు కంటోంది..

| Edited By:

May 21, 2019 | 9:02 PM

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కొట్టిపారేశారు. బీజేపీ ఎప్పుడూ కలలు కంటూ ఉంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడిపోనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొనడాన్ని కూడా ఖర్గే తోసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్లకు ఓ అవకాశం వచ్చిందని గుర్తుచేశారు. మెజారిటీ నిరూపించుకోమని […]

మాకేం ఢోకా లేదు... బీజేపీ అలా కలలు కంటోంది..
Follow us on

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కొట్టిపారేశారు. బీజేపీ ఎప్పుడూ కలలు కంటూ ఉంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడిపోనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొనడాన్ని కూడా ఖర్గే తోసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఎప్పుడూ కలలు కంటూనే ఉంటారని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్లకు ఓ అవకాశం వచ్చిందని గుర్తుచేశారు. మెజారిటీ నిరూపించుకోమని అవకాశమిచ్చినా.. నిరూపించుకోలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు.

కర్ణాటకలో మళ్లీ ఎన్నికలను ప్రజలెవరూ కోరుకోవడం లేదని, అదీగాక కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఐక్యంగా ఉందని ఖర్గే తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను బీజేపీ 104 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మెజారిటీకి అవసరమైన సీట్లు సాధించలేకపోయింది. మెజారిటీకి 113 సీట్లు అవసరంగా కాగా, 37 ఎమ్మెల్యేలున్న జేడీఎస్, 80 మంది సభ్యులున్న కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు.