కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ

| Edited By: Vijay K

Mar 29, 2019 | 8:39 PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కృతజ్ఞతలు చెప్పారు. కృతజ్ఞతలు చెప్పడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అబ్బే అదేంలేదు.. ఏప్రిల్ 6న అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరతానని బీజేపీ నాయకుడు శతృఘ్న సిన్హా ప్రకటించిన విషయం తెలిసిందే. అతనితో పాటుగా మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. అయితే దీనిపై అరుణ్ జైట్లీ మాట్లాడుతూ సెటైర్ వేశారు. మా సమస్య ఇప్పడు మీ పార్టీలో చేరింది. “థ్యాంక్యూ కాంగ్రెస్‌” అని కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి చెందిన కొందరు […]

కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ
Follow us on

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ కృతజ్ఞతలు చెప్పారు. కృతజ్ఞతలు చెప్పడం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అబ్బే అదేంలేదు.. ఏప్రిల్ 6న అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరతానని బీజేపీ నాయకుడు శతృఘ్న సిన్హా ప్రకటించిన విషయం తెలిసిందే. అతనితో పాటుగా మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. అయితే దీనిపై అరుణ్ జైట్లీ మాట్లాడుతూ సెటైర్ వేశారు. మా సమస్య ఇప్పడు మీ పార్టీలో చేరింది. “థ్యాంక్యూ కాంగ్రెస్‌” అని కౌంటర్ ఇచ్చారు.

బీజేపీకి చెందిన కొందరు మాజీ నేతలను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుని తమకు కానుకగా ఇచ్చినట్టు భావిస్తున్నామని జైట్లీ చెప్పారు. అందుకు మేమంతా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. మా సమస్య ఇప్పడు మీ పార్టీలో ఉంది. గుడ్‌ లక్‌ అంటూ జైట్లీ తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల మహాకూటమిపై కూడా జైట్లీ విమర్శలు చేశారు. మహాకూటమి ఓ సర్కస్‌లా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా ఇంతవరకూ కూటమి ఏర్పడలేదని విమర్శించారు. ప్రతిపక్షాలకు అసలు సరైన నాయకుడే లేడని ఎద్దేవా చేశారు.