TDP Anitha: వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తే సహించేది లేదు.. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతల మీద వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, పరుష పదజాలం మీద తెలుగు మహిళా

TDP Anitha: వైసీపీ నేతలు మహిళలను అవమానిస్తే సహించేది లేదు.. తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత హెచ్చరిక
Anita

Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:28 PM

Telugu Mahila President Anita: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతల మీద వైసీపీ నేతలు, మంత్రులు చేస్తున్న విమర్శలు, పరుష పదజాలం మీద తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ” గౌతమ్ సవాంగ్ డీజీపీ కాదు.. డీజేపీ. డీజేపీ అటే డైరెక్ట్ జగన్ పాలేరు. సీఎం జగన్ చెప్పినట్టు ఆ పార్టీ కార్యకర్తలకు వచ్చింది బీపీ కాదు.. జేపీ. జేపీ అంటే జగన్ ప్రెషర్. జగన్ ప్రెషరుతోనే దాడులు.” అంటూ అనిత కొత్త భాష్యం చెప్పుకొచ్చారు.

“గాజులు తొడుక్కోలేదని వైసీపీ నేతలకు.. గాజులు వేసుకునే చేతుల్లో ఉన్న కత్తి కన్పించడం లేదా..? త్వరలో గాజుల చేతులకు ఉన్న పవర్ ఏంటో చూపిస్తాం. గాజుల చేతులతోనే వీపులు పగుల కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సన్న బియ్యం సన్నాసి ఓ మంత్రి మాట ముందో అమ్మ.. మాట వెనుకో అమ్మ అంటారు. ఆ మంత్రి ఏ అమ్మ గురించి మాట్లడుతున్నారో.. ఏ అమ్మకు పుట్టారో ఆయనకే తెలియాలి. సిల్వర్ స్క్రీన్ మీద నుంచి అప్పుడప్పుడు పోలిటికల్ స్క్రీన్ మీదకు ఓ నేత వస్తుంది. జబర్దస్త్ కాల్షీట్లు అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీదకొస్తారు. జగన్ కాళ్లు.. వెంట్రుకలు అంటూ ఆమె ఏదో మాట్లాడుతున్నారు. ఆమె అన్నట్టు జగన్ కాళ్లు ప్రజలకు కన్పిస్తూనే ఉన్నాయి.. జగన్ కాళ్లు ఎప్పుడు లాగేద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు.” అని అనిత వ్యాఖ్యానించారు.

“జగన్ రెడ్డి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్ లో ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. యువత భవిష్యత్ ను సీఎం నాశనం చేస్తున్నారు. ప్రశ్నించిన ప్రతిపక్షంపై దాడులు చేస్తున్నారు. వైసీపీ నేతల భాష ఎలా ఉందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత హోంమంత్రికి లేదు. ఆమె కీలుబొమ్మగా, రబ్బరు స్టాంప్ గా మారారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. బూతుల మంత్రులందరూ ఉదయం నుంచి మొరుగుతూనే ఉన్నారు. ప్రశ్నిస్తే.. దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేతది రాజ్యాంగబద్ధ పదవి కాదా..?” అని అనిత ప్రశ్నలు కురిపించారు.

Read also: Lakshmi Parvathi: అల్లుడి నిరాహార దీక్ష ప్రక్క నుండే వచ్చాను.. శిబిరం దగ్గర అదే మాట్లాడుకుంటున్నారు: లక్ష్మీ పార్వతి