TDP Mahanadu : ‘మహానాడు’ను వరుసగా రెండో ఏడాది జూమ్ లో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ. రేపు ఉదయం 10 గంటల నుంచి

|

May 26, 2021 | 11:12 PM

TDP Mahanadu 2021 : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'మహానాడు' కార్యక్రమం ఈ ఏడాది కూడా డిజిటల్ వేదికగా నిర్వహించబోతున్నారు..

TDP Mahanadu : మహానాడును వరుసగా రెండో ఏడాది జూమ్ లో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ. రేపు ఉదయం 10 గంటల నుంచి
Tdp President Chandra Babu Naidu
Follow us on

TDP Mahanadu 2021 : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమం ఈ ఏడాది కూడా డిజిటల్ వేదికగా నిర్వహించబోతున్నారు. టీడీపీ అధిష్టానం నిర్ణ‌యం మేరకు ఈ సారి కూడా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు నిర్ణయించారు. రేపు, ఎల్లుండి జ‌రిగే మ‌హానాడులో పాల్గొనాల‌ని పార్టీ నాయ‌కుల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. “స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం. మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే ‘#DigitalMahanadu2021’లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. ‘డిజిటల్ మహానాడు 2021’ను విజయవంతం చేయండి” అని టీడీపీ అధినేత పార్టీ శ్రేణులను కోరారు.

Read also : TS Cabinet : 30న టీఎస్ క్యాబినెట్ భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం