Talasani Srinivas Yadav: మరోసారి ఉమ్మడి రాష్ట్రంగా మార్చే కుట్ర ఇది.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..

|

Feb 09, 2022 | 3:26 PM

తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్..

Talasani Srinivas Yadav: మరోసారి ఉమ్మడి రాష్ట్రంగా మార్చే కుట్ర ఇది.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..
Talasani Srinivas Yadav
Follow us on

Minister Talasani Srinivas Yadav: తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాయస్ యాదవ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..  తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ప్రధాని మోదీ పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని విమర్శించారు. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చారా? అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే విరుచుకుపడిన బీజేపీ నేతలు..ప్రధాని వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

ప్రధాని క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని మంత్రి తలసాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, MLC ప్రభాకర్, MLA లు మాగంటి గోపినాధ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: Tukkuguda: అధికార టీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి చేరిన తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

UP Elections: ఎస్పీలో అఖిలేష్ యాదవ్ మేనమామ శివపాల్‌కు అవమానం! బీజేపీలో చేరిన పీఎస్పీ నేతలు..