ఎన్నికల మ్యానిపెస్టోలో పెట్టిన ఎనబై శాతం హామీలను నెరవేర్చాం, మిగతావి రాబోయే మూడు ఏండ్ల లో పూర్తి చేస్తామని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు లక్షా ముఫ్పై రెండు వేల 899 ఉద్యోగాలు ఇచ్చాం, మరో యాబై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ సిద్దం చేశామని చెప్పారు. సిఎం కేసిఆర్, కేటిఆర్ నాయకత్వంలో అన్ని రంగాల లో ముందజలో ఉన్నామని ఎర్రబెల్లి తెలిపారు.
బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి రికార్డు స్థాయిలో ధరలు పెంచారని విమర్శించారు. నల్ల ధనం వెలికి తీసి వందరోజుల్లో ఒక్కొక్కరి కాథాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పావ్ ఎవరికైనా వేశావా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. రైల్వేను కూడా ప్రధాని మోడీ ప్రయివేటు పరం చేస్తాడు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేశాక రిజర్వేషన్‌లు ఎలా అమలవుతాయని ప్రశ్నించారు.
కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. రాష్ట్రానికి కావాలని అడిగినా ఒక్క కాలేజీ నీ ఇవ్వలేదని మంత్రి ఎర్రబెల్లి మండిపడ్డారు. బండి సంజయ్ పిచ్చికూతలు కూస్తడు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను కేంద్రం మోసం చేస్తుంది. రైతులు ధర్నా చేస్తే బిజేపి స్పందించడం లేదు. బిజేపి కన్నా దొంగలు నయం.. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్దిని మేము బహిర్గతం చేశాం, బిజేపి చేసినవి మీరూ మీడియా ఎదుట ఆధారాలతో చెప్పుతారా అని సవాల్ చేశారు.
విభజన చట్టం లో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఇస్తామని చెప్పి ఇతర రాష్ట్రాలకు తరలించావు. కరోనాలో కేంద్రం సహాయం చేయలేదు. మీకు ఎందుకు ఓటేయాలి.? కేంద్రానికి రాష్ట్రం రెండు లక్షల డెబ్బైరెండు వేల కోట్లు పన్నుకట్టాం, లక్షాయాబై వేల కోట్లు మాత్రమే తిగిగి ఇచ్చింది. మిగతా డబ్బు ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది, బిజేపి పార్టీ ఆరు సంవత్సరాల నుండి నాశనం చేస్తూ వస్తుంది. చైనాను లడాక్ నుంచి తరిమి కొడతాం అన్నరు ఏమైంది.? ఖమ్మం, నల్గొండ, వరంగల్ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్ లను కోరుతున్న.. పల్లా రాజేశ్వర్ రెడ్డిని, హైదరాబాదులో పివి నరసింహారావు కూతురు సురభి వాణీ దేవి ని మంచి మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తిరగ బడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు ఎందుకు వేయాలి పట్టభద్రులు ఆలోచన చేయాలి. రైల్వే ప్లాట్ ఫాం పై చాయ్ అమ్ముకుని ప్రధాని, నేడు ఆ సంస్థని ప్రైవేటుపరం చేస్తున్నాడు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నూతన చట్టాలను తీసుకు వచ్చి రైతు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్న కేంద్రానికి ఎందుకు ఓటు వేయాలి. రాజకీయ లబ్ధికోసం చీటికిమాటికి భద్రకాళి, భాగ్యలక్ష్మి ఆలయాలకు రమ్మంటూ సవాల్ చేయడం బిజెపి నేతల కు అలవాటుగా మారిపోయిందని మంత్రి పడ్డారు.
చిల్లర గాళ్ళతో డిస్కస్ చేసే సమయం మా వద్ద లేదని ఎర్రబెల్లి. ముంబై అల్లర్ల తీవ్రవాది తల ఎక్కడ, భేటీ బచావో ఎవరిని బతికించింది, బేటి పడావో ఏం చేసింది, ఇక్కడ బిజెపి నేతలు చెప్పాలి. పట్టభద్రుడు ఆలోచించి విద్యావేత్త పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటు వేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తీ రెడ్డి, zp చైర్మన్ పాగా ల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పొకల జామున, తదితరులు ఉన్నారు.
Read More: