రెండోరోజు విధులు బహిష్కరించిన న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ ఆందోళనలు

|

Feb 19, 2021 | 1:32 PM

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల దారుణ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోలనలు..

రెండోరోజు విధులు బహిష్కరించిన న్యాయవాదులు.. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను ఖండిస్తూ ఆందోళనలు
Follow us on

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల దారుణ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోలనలు రెండోరోజు కొనసాగుతున్నాయి. న్యాయవాదుల హత్యలను ఖండిస్తూ రెండవ రోజు విధులు బహిష్కరించి, కోర్టుల ముందు నిరసనకు దిగారు న్యాయవాదులు.

రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి న్యాయవాదులను శాంతింపజేశారు. న్యాయవాద దంపుతులను దారుణంగా హత్య చేయించిన అసలు సూత్రదారులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

అటు నాంపల్లి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి, కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. న్యాయవాది దంపతుల కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసులో స్వతంత్ర సంస్థ చేత నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు.

Read more:

ఏపీలో తెలంగాణ సీన్‌ రిపీట్‌.. నెల్లూరులో ప్రముఖ న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తుల హత్యాయత్నం..