Vijayashanthi : దళిత మహిళ లాకప్ డెత్ తో పోలీస్ స్టేషన్లు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది : విజయశాంతి

|

Jun 26, 2021 | 9:36 AM

పోలీసులు మరియమ్మను రాత్రి వేళ స్టేషన్‌కి తీసుకెళ్ళడమేగాక... ఒక మహిళను అదుపులోకి తీసుకున్నప్పుడు మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులే అమలు చెయ్యకపోవడం..

Vijayashanthi : దళిత మహిళ లాకప్ డెత్ తో పోలీస్ స్టేషన్లు ఎలా పనిచేస్తున్నాయో అర్థమవుతోంది  : విజయశాంతి
Vijayashanthi
Follow us on

Vijayashanthi : తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీస్ దెబ్బలు తాళలేక ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు కావడం ఘటనలపై బీజేపీ మహిళా నేత విజయశాంతి తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో పోలీసులు మరియమ్మను రాత్రి వేళ స్టేషన్‌కి తీసుకెళ్ళడమేగాక… ఒక మహిళను అదుపులోకి తీసుకున్నప్పుడు మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులే అమలు చెయ్యకపోవడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తోందని ఆమె ట్విట్టర్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఘటన జరిగిన సదరు పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోవడం మన వ్యవస్థలు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నాయో అర్థమవుతోందన్నారు విజయశాంతి. ఈ కేసులో న్యాయస్థానం ఆదేశించిన ప్రకారం రీపోస్ట్‌మార్టం చేయించి, తప్పుచేసినవారికి కఠిన శిక్షవిధించి తల్లిని కోల్పోయిన ఆ బాధిత కుటుంబానికి కొంతైనా న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఎందరో మహిళలు, దళితులు ఎన్నో విధాలుగా వెతలకు గురవుతున్నా… ఆ కేసులు సరైన సమయంలో పరిష్కారం కాకపోవడం, బాధితులు న్యాయం కోసం నిరీక్షిస్తూ ఉండటం జరుగుతోందన్నారు. ఈ పరిణామాలకు తెలంగాణ సర్కారు పూర్తి బాధ్యత వహించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

Read also : Tragedy : కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో శవాలుగా మారిన నలుగురు కుటుంబ సభ్యులు