TS congress : గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇవీ.. డిమాండ్లు

ప్పటి వరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు చెల్లించిన డబ్బులను బాధితులకు వెనక్కి ఇప్పించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు సమర్పించిన వినతి పత్రం ద్వారా రాష్ట్రపతికి..

TS congress : గవర్నర్‌ను కలిసి రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇవీ.. డిమాండ్లు
Ts Congress Leaders

Updated on: Jun 04, 2021 | 6:57 PM

Telangana congress leaders submitted memorandum to President of India : తెలంగాణలో కరోనా మహమ్మారిని నియంత్రించడం, వ్యవస్థల్ని నిర్వహించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కొవిడ్ కష్టకాలంలో ప్రైవేటు ఆసుపత్రులు చికిత్సల పేరిట లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు . ఈ అక్రమ దాందాల నుంచి కుటుంబాలు ఉపశమనం పొందేలా కొవిడ్ -19, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్సలను ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా పథకంలో చేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ సాయంత్రం హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై తో భేటీ అయిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఏఐసీసీ పిలుపు మేరకు గవర్నర్ ను కలిసిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.. రాష్ట్రపతి పేరున ఉన్న వినతి పత్రాన్ని గవర్నర్ కు అందజేస్తారు.

దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ఉచితంగా ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని, రోజుకు కోటి మందికి వ్యాక్సిన్ వేసి వాక్సి నేషన్ వేగం పెంచాలని, రాష్ట్రంలో కరోనా, బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స ఉచితంగా చేయాలని, ఇప్పటి వరకు అధికంగా ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు చెల్లించిన డబ్బులను బాధితులకు వెనక్కి ఇప్పించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ కు సమర్పించిన వినతి పత్రం ద్వారా రాష్ట్రపతికి నివేదించే ప్రయత్నం చేశారు.

Read also : Gautam Sawang : కరోనా వేళ పౌర సమాజం, ఎన్జీవోల అమూల్యమైన సమాజ సేవలను “మానవత్వ ధీర” గా గుర్తిస్తాం : ఏపీ డీజీపీ