పార్టీ ఫిరాయింపులపై టీడీపీ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. రాజకీయాల్లో స్టెబిలిటీ ఉండాలన్నారు. ఎవరు పార్టీ మారినా కొంత ప్రభావం ఉంటుందని, అయినా పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని చికిత్స చేయాలన్నారు. వెళ్లిపోయిన వాళ్ల గురించి ఆలోచించకుండా.. నేతలు, కార్యకర్తల నుంచి మళ్లీ కొత్త నాయకత్వం తయారవ్వాలన్నారు.
అలాగే.. జగన్ పాలనపై కూడా మాట్లాడారు అశోక్ గజపతి రాజు. ఏపీలోని నెలరోజుల పాలనపై ఇప్పుడే చెప్పలేమని, ట్రెండ్స్ గమ్మత్తుగా ఉన్నాయన్నారు. జగన్ ఎన్నికల ముందు ఒకటి.. తర్వాత ఒకటి మాట్లాడుతున్నారన్నారు. అయినా.. జగన్ లాంటి వ్యక్తులు నీతి గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు టీడీపీ నేత అశోక్ గజపతి.