ఆలయాల విధ్వంసం వెనుక టీడీపీ కుట్రే.. సంతబొమ్మాళిలో ఆయన మనుషులు అడ్డంగా దొరికారన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల విధ్వంసంపై అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ప్రభుత్వం కనుసన్నల్లోనే దేవతా విగ్రహాలు..

ఆలయాల విధ్వంసం వెనుక టీడీపీ కుట్రే.. సంతబొమ్మాళిలో  ఆయన మనుషులు అడ్డంగా దొరికారన్న మంత్రి

Updated on: Jan 20, 2021 | 6:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల విధ్వంసంపై అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ప్రభుత్వం కనుసన్నల్లోనే దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయని టీడీపీ ఆరోపిస్తుండగా అదే స్థాయిలో మంత్రులు కౌంటర్‌ వేస్తున్నారు.

ఆలయాలపై దాడి ఘటన శ్రీకాకుళం జిల్లా నేతలు రచ్చకెక్కి మాటల యుద్ధం చేసుకుంటున్నారు. మంత్రి సీదిరి అప్పల్రాజు వర్సెస్‌ టీడీపీ నేత అచ్చెన్నాయుడుగా మారింది. ఏపీలో ఆలయాల్లో విధ్వంసాల వెనుక టీడీపీ కుట్ర ఉందని మంత్రి సీదిరి అప్పల్రాజు ఆరపిస్తున్నారు.

అచ్చెన్నాయుడి సొంత మండలం సంతబొమ్మాలిలో ఆయన మనుషులు అడ్డంగా దొరికిపోయారని అప్రల్రాజు అన్నారు. దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్న అభివృద్ధి పనుల నుంచి దృష్టి మరల్చేందుకే టీడీపీ ఆలయాల కుట్రకు తెరలేపిందిన అప్పల్రాజు ఆరోపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us