Lokesh: బంధువులకు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారింది : నారా లోకేష్

|

Sep 11, 2021 | 10:17 PM

ఆంధ్రప్రదేశ్ లో భూ కబ్జాలు, ఆక్రమణలపై నిలదీస్తే.. నిర్బంధం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

Lokesh: బంధువులకు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారింది : నారా లోకేష్
Lokesh
Follow us on

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో భూ కబ్జాలు, ఆక్రమణలపై నిలదీస్తే.. నిర్బంధం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పోలీసు వ్య‌వ‌స్థని సీఎం జ‌గ‌న్‌ రెడ్డి ఫ్యాక్ష‌న్ సైన్యంగా మార్చుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఏపీలో రాక్ష‌స రాజ్యం సాగుతోందన్న లోకేష్.. కబ్జాలపై స్వయంగా వైసీపీ కార్యకర్తలే బహిరంగా చెప్పే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం వైయస్ జగన్‌రెడ్డి బంధువులు, పార్టీ నేత‌ల‌కు అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారిందని లోకేష్ అన్నారు. వారి క‌న్నుప‌డితే క‌బ్జా, ఆశ‌ప‌డితే ఆక్ర‌మ‌ణ.. అన్నట్టుగా తయారైందని లోకేష్ విమర్శించారు. శనివారం లోకేష్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా మైదుకూరులో వైసీపీ నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి.. తమ పార్టీకి చెందిన కార్యకర్త పొలాన్నే క‌బ్జా చేశార‌ని లోకేష్ ఎద్దేవా చేశారు.

ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్య‌క‌ర్త‌ అక్బర్ బాషా దీనిపై నిలదీసినందుకు.. ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని మైదుకూరు సీఐ కొండారెడ్డి బెదిరించే పరిస్థితికి వచ్చిందని లోకేష్ విమర్శించారు. సీఎం సొంత జిల్లా, సొంత పార్టీ కార్య‌క‌ర్త బాషాయే వైసీపీ నేత‌ల అరాచ‌కాల‌కు తాళ‌లేక కుటుంబంతో స‌హా ఆత్మ‌హ‌త్య చేసుకుంటామ‌ని రోధిస్తున్నారనన్నారని ఇక మిగతా పార్టీ వాళ్ల పరిస్థితేంటో అర్థం చేసుకోవాలని లోకేష్ వాపోయారు.

Read also: Huzurabad: హుజూరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌ వర్గాల మకాం .. నోటిఫికేషన్ మీద భారీ సస్పెన్స్‌