టీడీపీ నన్ను మోసం చేసింది: బుట్టా రేణుక

|

Mar 16, 2019 | 7:08 PM

హైదరాబాద్: బుట్టా రేణుక, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, మాగుంట శ్రీనువాసుల రెడ్డి వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన తర్వాత బుట్టా రేణుక మీడియాతో మాట్లాడారు. చిన్న అపార్ధంతో పెద్ద తప్పు చేశానని ఆమె అన్నారు. భ్రమలో నేను టీడీపీకి వెళ్లి తప్పు చేశాను, ఇప్పుడు సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఎక్కడ గౌరవముంది? ఎక్కడ మంచి స్థానముందో తెలిసొచ్చింది. వైసీపీ మీద గౌరవంతోనే తిరిగి […]

టీడీపీ నన్ను మోసం చేసింది: బుట్టా రేణుక
Follow us on

హైదరాబాద్: బుట్టా రేణుక, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వంగా గీత, మాగుంట శ్రీనువాసుల రెడ్డి వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీలో చేరిన తర్వాత బుట్టా రేణుక మీడియాతో మాట్లాడారు. చిన్న అపార్ధంతో పెద్ద తప్పు చేశానని ఆమె అన్నారు. భ్రమలో నేను టీడీపీకి వెళ్లి తప్పు చేశాను, ఇప్పుడు సొంతింటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. ఎక్కడ గౌరవముంది? ఎక్కడ మంచి స్థానముందో తెలిసొచ్చింది. వైసీపీ మీద గౌరవంతోనే తిరిగి మళ్లీ వచ్చానని అన్నారు. టీడీపీ నన్ను మోసం చేసింది, వాళ్లకు కనీస మర్యాద కూడా లేదని ఆమె అన్నారు.

బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ బీసీలను కాదని, ఓసీలకు టిక్కెట్ ఇస్తుంది. టీడీపీలో మాటలు ఒక రకంగా ఉంటే, చేతలు మరో రకంగా ఉంటాయి. సీటు కేటాయింపు విషయంలో సిట్టింగ్ ఎంపీగా తనను పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకోవాలన్న కనీస మర్యాదను కూడా టీడీపీ పాటించలేదు. తాను ఎక్కడి నుంచీ పోటీ చేయడంలేదని, వైసీపీని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బుట్టా రేణుకా చెప్పారు.