పర్సన్ 1: ఇప్పటివరకు నడిచిన పంచాయతీ చెమటలు పట్టించినాది. ఇకపై ఎట్టా ఉంటుందో..
పర్సన్2: ఏమో అప్పా.. ఈ ఎన్నికల యవ్వారం తలుచుకుంటుంటేనే గుండెల్లో గుబులైతాంది
ఇప్పుడు తాడిపత్రిలో ఏ ఇద్దరు మనుషులు జమ కూడినా ఇదే చర్చ జరుగుతోంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలప్పుడు జరిగినప్పుడు సాగిన సవాళ్ల పర్వం, ఉద్రిక్త పరిస్థితులు చూసిన వారికి ఆ మాత్రం గుబులు లేకుండా ఎట్టా ఉంటది చెప్పండి. ఇక తాడిపత్రిలో ఈసారి కూడా జేసీదే పైచేయి అవుతుందా? ఇప్పుడు అక్కడ ప్రధానమైన చర్చనీయాంశమైంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండు ప్రభాకర్‌రెడ్డి వర్గానికే వచ్చాయి. మరి ఇప్పుడు రెండు కోఆప్షన్ సభ్యుల ఎన్నికలోనూ ఆయన ఆధిప్యతం కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు తాడిపత్రిలో ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ ఇద్దరు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో తమ కౌన్సిలర్లను జేసీ ప్రభాకర్‌రెడ్డి క్యాంప్‌నకు తరలించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. దాంతో ఈసారి కూడా జేసీ మద్దతుదారులకే ఆ రెండు పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజలు నిర్ణయించిన తర్వాత గొడవలు వద్దని సీఎం జగన్ సూచించడంతోనే.. ఎమ్మెల్యే వర్గం సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. మరికొద్దిసేట్లో కానీ అసలు సస్పెన్స్ వీడనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
పార్టీల బలాబలాలు ఇలా
తాడిపత్రి మున్సిపాల్టీలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ టీడీపీకే మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ బలం 20కి పెరిగింది. వైసీపీకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది.
Also Read:సిరాజ్ బౌలింగ్‌కు ఫిదా అయిన పాకిస్తాన్ యాంకర్ జైనాబ్ అబ్బాస్.. ఏం జరుగుతోంది..?