సార్వత్రిక ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న లోక్‌సభ స్పీకర్‌

న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌, ఇండోర్‌ పార్లమెంట్‌ సభ్యురాలు సుమిత్రా మహాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమిత్రా మహాజన్‌ ఇవాళ ప్రకటించారు. ఇండోర్‌ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆమె ప్రశ్నించారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని ఆమె లేఖలో కోరారు. ఇండోర్‌ నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికలు మొదలుకొని 2014 సార్వత్రిక ఎన్నికల వరకు ఆమె ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. […]

సార్వత్రిక ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న లోక్‌సభ స్పీకర్‌

Edited By:

Updated on: Apr 05, 2019 | 3:49 PM

న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌, ఇండోర్‌ పార్లమెంట్‌ సభ్యురాలు సుమిత్రా మహాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుమిత్రా మహాజన్‌ ఇవాళ ప్రకటించారు. ఇండోర్‌ ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆమె ప్రశ్నించారు. వీలైనంత త్వరగా అభ్యర్థిని ప్రకటించాలని ఆమె లేఖలో కోరారు. ఇండోర్‌ నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికలు మొదలుకొని 2014 సార్వత్రిక ఎన్నికల వరకు ఆమె ఎనిమిది సార్లు ఎంపీగా గెలుపొందారు. ఈ నెలలో సుమిత్రా మహాజన్‌ 76వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. 75 ఏళ్ల వయస్సు నిబంధన రీత్యా.. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిని పక్కన పెట్టిన నేపథ్యంలో సుమిత్రా మహాజన్‌ను కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ముందుగానే సార్వత్రిక ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us