Subbarao Gupta Apology: సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మరో టర్న్.. పొరపాటున అనుచిత వ్యాఖ్యలు చేశా.. అంత మాత్రాన దాడి చేస్తారా..

ఒంగోలులో సంచలనంగా మారిన సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు పొరపాటున చేశానని, అంతమాత్రాన తనపై దాడి చేయడం మంచి పద్దతి కాదన్నారు వైసిపి నేతల చేతుల్లో..

Subbarao Gupta Apology: సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మరో టర్న్.. పొరపాటున అనుచిత వ్యాఖ్యలు చేశా.. అంత మాత్రాన దాడి చేస్తారా..
Subbarao Gupta
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 21, 2021 | 9:52 AM

ఒంగోలులో సంచలనంగా మారిన సుబ్బారావు గుప్తా ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు పొరపాటున చేశానని, అంతమాత్రాన తనపై దాడి చేయడం మంచి పద్దతి కాదన్నారు వైసిపి నేతల చేతుల్లో దాడికి గురైన సుబ్బారావు గుప్తా. తన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరిగి ఉంటే క్షమించాలని కోరారు. తాను పార్టీ మంచి కోసం చేసిన వ్యాఖ్యలను పాజిటివ్‌గా తీసుకోవాలని అన్నారు. ఒక సామాన్యుడిగా ఉన్న తనపై దాడి జరిగితే రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేతలు స్పందించడం చూస్తుంటే సంఘటన ఎంత తీవ్రమైనదో అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు సుబ్బారావు గుప్తా.

ప్రకాశం జిల్లాలో ఇటీవల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా YCP కార్యకర్త సుబ్బారావు గుప్తా కొంచెం రెచ్చిపోయాడు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులపై సీరియస్‌ కామెంట్స్‌ చేశాడు. వీళ్లంతా ఒట్టి వెధవలంటూ రెచ్చిపోయాడు.

అంతటితో ఆగకుండా వీరివల్ల 20 శాతం ఓట్లు పోతాయన్నారు గుప్తా. టీడీపీ పవర్‌లోకి వస్తే కర్రలతో కొడతారని, వీళ్లంతా మనకు మిత్రులా, కోవర్టులా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సుబ్బారావు.

సుబ్బారావు చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమను బెదిరించారని చెప్తున్నారు సుబ్బారావు భార్య నాగమణి.

గుంటూరులోని ఓ లాడ్జిలో గుప్తా ఉన్నారని తెలిసి, అక్కడికి వెళ్లారు బాలినేని అనుచరులు సుభాని. పార్టీకి నష్టం జరిగేలా ఎందుకు మాట్లాడావంటూ సుబ్బారావును చితకబాదారు. ఈ వీడియో వైరల్ కావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

మంత్రి బాలినేని కూడా ఈ మొత్తం ఎపిసోడ్‌పై స్పందించారు. సుబ్బరావుగుప్తాపై జరిగిన దాడిని ఖండించారాయన. తమ అనుచురులు ఆవేశంతో దాడికి యత్నించారనీ.. అయినప్పటికీ తనే అడ్డుకున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..

Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..