మోదీ… చూపుతా నా తడాఖా.. వారణాసిలో జవాన్ సవాల్

ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం పోరు రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు నిజామాబాద్ రైతులు పోటీకి దిగుతుంటే.. మరో వైపు తమిళ రైతులు కూడా ఇక్కడి నుంచే పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఇక్కడి నుంచి పోటీకి బీఎస్ఎఫ్ జవాన్ రంగంలోకి దిగనున్నారు. దీంతో చౌకీదార్ వర్సెస్ చౌకీదార్‌గా వారణాసి పోరు జరగనుంది. బీఎస్‌ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్.. గతంలో ఆర్మీ అధికారులు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ.. ఓ […]

మోదీ... చూపుతా నా తడాఖా.. వారణాసిలో జవాన్ సవాల్

Edited By:

Updated on: Apr 29, 2019 | 7:16 PM

ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం పోరు రసవత్తరంగా మారుతోంది. ఓ వైపు నిజామాబాద్ రైతులు పోటీకి దిగుతుంటే.. మరో వైపు తమిళ రైతులు కూడా ఇక్కడి నుంచే పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఇక్కడి నుంచి పోటీకి బీఎస్ఎఫ్ జవాన్ రంగంలోకి దిగనున్నారు. దీంతో చౌకీదార్ వర్సెస్ చౌకీదార్‌గా వారణాసి పోరు జరగనుంది. బీఎస్‌ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్.. గతంలో ఆర్మీ అధికారులు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ.. ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. నిబంధనలకు విరుద్దంగా ఫిర్యాదు చేసిన అతన్ని ఉద్యోగం నుంచి బీఎస్‌ఎఫ్ తొలగించింది.

అయితే ఇటీవలే తేజ్ బహదూర్ యాదవ్ సమాజ వాదీ పార్టీలో చేరారు. దీంతో ఎస్పీ నుంచి వారణాసి అభ్యర్ధిగా అతడిని బరిలో దించింది. ఇంతకుముందే పార్టీ తరపున ఎస్పీ అభ్యర్థిగా శాలినీ యాదవ్‌ను ప్రకటించిన పార్టీ.. తాజాగా ఆమె స్థానంలో జవాన్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో భాగంగా ఈ స్థానాన్ని ఎస్పీకి కేటాయించారు. కూటమి అభ్యర్థిగా వ్యూహాత్మకంగా మాజీ జవాన్ తేజ్ బహదూర్‌ను పోటీకి నిలిపారు.

అయితే, వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని పోటీకి నిలుపుతారని ఎస్పీ-బీఎస్పీ కూటమి భావించింది. ఆమె ఇక్కడ పోటీ చేయట్లేదని స్పష్టమవడంతో తమ ఎంపీ అభ్యర్థిని తాజాగా ఎస్పీ మార్చింది.