కడప: పులివెందులలోని స్వగ్రహంలో హత్యకు గురైన వైఎస్సార్ సొదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఆమె తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వివేకా సతీమణి సౌభాగ్యకు సంతాప సందేశం పింపించారు. లోక్ సభలో ఎంపీగా చేసిన సేవలు, ఆయన విధేయత, వినయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ మరచిపోలేనని అన్నారు. వివేకా మరణంతో ఆయన కుటుంబానికి కలిగిన బాధను తాను అర్థం చేసుకోగలనని, ఆయన మృతికి దారి తీసిన కారణాలు నిష్పక్షపాతంగా జరిపే దర్యాప్తులో వెల్లడవుతాయని భావిస్తున్నట్టు సోనియా గాంధీ సందేశంలో తెలిపారు.