వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు

హైదరాబాద్: సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వీరభద్రరావు భేటీ అయ్యారు. పార్టీలో చేరిన అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చేరాను కాబట్టి తనను పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా పని చేస్తామని చెప్పారు. అది జగన్ మోహన్ రెడ్డిగారి మీద […]

వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు

Updated on: Mar 09, 2019 | 12:19 PM

హైదరాబాద్: సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో వీరభద్రరావు భేటీ అయ్యారు.

పార్టీలో చేరిన అనంతరం దాడి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో చేరాను కాబట్టి తనను పార్టీ ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా పని చేస్తామని చెప్పారు. అది జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఆధారపడి ఉందని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. జగన్‌‌కులాగ ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన వారు ఎవరూ లేరని, ఈ పాదయాత్ర ద్వారా జగన్ ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలసుకున్నారని దాడి వీరభద్రరావు అన్నారు.

చంద్రబాబు గారు రోజుకొకటి, గంటకొకటి, క్షణానికి ఒక ఆరోపణ చేస్తారని, చంద్రబాబుది మల్టీ టంగ్ అని దాడి ఆరోపించారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us