జమ్మూ కాశ్మీర్ లో ‘ కమల వికాసం ‘ … కాంగ్రెస్ నేతల ‘ వలసలు ‘

|

Jul 09, 2019 | 11:20 AM

ప్రధాని మోదీ నినాదమైన ‘ సబ్ కా సాథ్., సబ్ కా వికాస్..” జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ నేతలమీద తీవ్ర ప్రభావం చూపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్ మాలిక్.. తన మద్దతుదారులతో కలిసి సోమవారం బీజేపీలో చేరిపోయారు. మోదీ ప్రచారం చేస్తున్న ఈ నినాదం మైనారిటీలలో భద్రత పెంచిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వాన ఈ దేశం మరింత అభివృధ్ది చెందుతుందని, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన […]

జమ్మూ కాశ్మీర్ లో  కమల వికాసం  ... కాంగ్రెస్ నేతల  వలసలు
Follow us on

ప్రధాని మోదీ నినాదమైన ‘ సబ్ కా సాథ్., సబ్ కా వికాస్..” జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ నేతలమీద తీవ్ర ప్రభావం చూపింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్ మాలిక్.. తన మద్దతుదారులతో కలిసి సోమవారం బీజేపీలో చేరిపోయారు. మోదీ ప్రచారం చేస్తున్న ఈ నినాదం మైనారిటీలలో భద్రత పెంచిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వాన ఈ దేశం మరింత అభివృధ్ది చెందుతుందని, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఆయన రాజ్యాంగానికి ‘ ప్రణమిల్లారని ‘, ప్రజల ఆశయాలను ఆయన నెరవేరుస్తారని దీంతో నిరూపితమైందని మాలిక్.. పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, ఎంపవర్ మెంట్ ఆఫ్ మైనారిటీస్ అనే మూడు అంశాలకు ప్రాధాన్యమివ్వాలన్న ఆయన నిర్ణయం తమనెంతో ప్రభావితం చేసిందని మాలిక్..మోదీని పొగడ్తలతో ముంచెత్తారు.దేశంలో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలకు మోడీ పాలనలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. రాజౌరీ జిలాల్లోని దర్హల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన సుమారు దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కాగా వీరినందరినీ బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.