మా రాష్ట్రానికి 5. 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపండి, ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమత లేఖ

| Edited By: Phani CH

Apr 18, 2021 | 7:11 PM

తమ రాష్ట్రానికి అత్యవసరంగా 5.4 కోట్ల వ్యాక్సిన్  డోసులను,  రెమ్ డిసివిర్ మందులను పంపాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని  కోరారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాస్తూ..

మా రాష్ట్రానికి 5. 4 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపండి, ప్రధాని మోదీకి  బెంగాల్ సీఎం మమత లేఖ
Mamata Banerjee.
Follow us on

తమ రాష్ట్రానికి అత్యవసరంగా 5.4 కోట్ల వ్యాక్సిన్  డోసులను,  రెమ్ డిసివిర్ మందులను పంపాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని  కోరారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ రాస్తూ..వీటితో బాటు ‘ టోసిలిజుమాబ్’ మెడిసిన్ ని, ఆక్సిజన్ సిలిండర్లను కూడా సప్లయ్ చేయాలన్నారు. బయటి నుంచి వస్తున్న వారి కారణంగా తమ రాష్ట్రంలో, ముఖ్యంగా కోల్ కతా నగరంలో  కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు. బయటి ‘గూండాలు’ మా రాష్ట్రంలో కోవిడ్ కేసులను వ్యాప్తి చెందింపజేస్తున్నారు అని ఆమె దుయ్యబట్టారు. రాష్ట్ర నిధులతో నేరుగా వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వాన్ని అనుమతించాలని, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంలో సహాయపడాలని మమత గత ఫిబ్రవరి 24 న ప్రధానికి లేఖ రాశారు. ఆ లేఖకు కేంద్రం నుంచి తమకు ఇప్పటివరకు సమాధానం రాలేదని ఆమె తెలిపారు. ఎన్నికల ర్యాలీల కోసమో, ఇతర పనుల కోసమో చాలామంది బయటి వ్యక్తులు తమ రాష్ట్రానికి వస్తున్నారని, ఈ కారణంగా కోవిడ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయని ఆమె అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ఈ పరిస్థితిని సృష్టిస్తున్నాయని ఆమె ఆరోపించారు.

కోల్ కతా నగర జనాభా పెరిగిపోయినందున కేంద్రం పంపుతున్న వ్యాక్సిన్ డోసులు ఏ మాత్రం సరిపోవడంలేదని, ప్రధాని గొప్పలకు పోయి సుమారు 80 దేశాలకు మన దేశం నుంచి వ్యాక్సిన్ సరఫరా చేశారని దీదీ విమర్శించారు. కేంద్రం కావాలనే తమ రాష్ట్రానికి అరకొరగా వ్యాక్సిన్ డోసులను పంపుతోందని కూడా ఆమె మండిపడ్డారు. బెంగాల్ అంటే కేంద్రానికి సవతి తల్లి  ప్రేమ అని ఆమె అన్నారు. ప్రధాని మోదీ తన ఎన్నికల ర్యాలీలకు బయటి వ్యక్తులను రప్పించుకోవడం కూడా కోవిడ్ కేసులు పెరిగిపోవడానికి కారణమవుతోందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. మోదీ సభలకు వస్తున్నవారిలో కొంత  మంది కరోనా వైరస్ పాజిటివ్ కి గురైనట్టు తమకు తెలిసిందని, వారు  తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకునేలా చూడాలని అధికారులను తాము ఆదేశించినట్టు ఆమె వెల్లడించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ‘నా సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించండి’ , ఘజియాబాద్ అధికారులకు మంత్రి వీకే .సింగ్ అభ్యర్థన

నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…