ఐదో దశ ఎన్నికల్లో అత్యంత సంపన్నురాలు పూనమ్‌ సిన్హా

| Edited By:

Apr 30, 2019 | 8:48 PM

సినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ సిన్హా ఐదో దశ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు. ఆమె పాట్నాసాహిబ్‌ కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హా సతీమణి. ఆమె ఆస్తుల విలువ రూ.193 కోట్లు. మే 6న జరిగే ఐదో దశలో పోటీపడుతున్న 184 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ కోటి అంతకంటే ఎక్కువగా ఉంది. బీజేపీ నుంచే ఎక్కువ మంది కోటీశ్వరులు బరిలో నిలిచారు. ఈ వివరాలన్నింటిని అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. […]

ఐదో దశ ఎన్నికల్లో అత్యంత సంపన్నురాలు పూనమ్‌ సిన్హా
Follow us on

సినీ నటి, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి పూనమ్ సిన్హా ఐదో దశ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు. ఆమె పాట్నాసాహిబ్‌ కాంగ్రెస్ అభ్యర్థి శతృఘ్న సిన్హా సతీమణి. ఆమె ఆస్తుల విలువ రూ.193 కోట్లు. మే 6న జరిగే ఐదో దశలో పోటీపడుతున్న 184 మంది అభ్యర్థుల ఆస్తుల విలువ కోటి అంతకంటే ఎక్కువగా ఉంది. బీజేపీ నుంచే ఎక్కువ మంది కోటీశ్వరులు బరిలో నిలిచారు. ఈ వివరాలన్నింటిని అసోసియేషన్ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. పూనమ్‌ సిన్హా లఖ్‌నవు నుంచి పోటీచేస్తున్నారు.

కోటీశ్వరుల జాబితాలో పూనమ్ మొదటి స్థానంలో ఉండగా, రూ.177 కోట్లతో విజయ్‌ కుమార్ మిశ్రా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మిశ్రా ప్రగతిశీల సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన అభ్యర్థి. రూ.77 కోట్లతో భాజపాకు చెందిన జయంత్ సిన్హా మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ నుంచి బరిలో నిలిచారు. ఈ దశలో పోటీ పడే అభ్యర్థుల్లో 28 శాతం మంది కోటీశ్వరులే. మొత్తం 674 మంది అభ్యర్థుల్లో 668 మంది అఫిడవిట్లను పరిశీలించిన మీదట ఏడీఆర్‌ ఈ నివేదికను తయారు చేసింది.