ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఘన విజయం తరువాత మీకేమనిపించింది అంటూ ఓ మీడియా ప్రతినిధి ఇటీవల జగన్‌ను ప్రశ్నించారు. దానికి స్పందించిన జగన్.. ఇంతటి అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా నాన్నను తలుచుకున్నా. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం తన తప్పు తెలుసుకొని, మిమ్మల్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. నా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలని నేను అనుకోవడం లేదు. దేవుడే వారికి శిక్ష వేస్తాడు. నాకు తెలిసి కాంగ్రెస్‌ను ఎప్పుడో క్షమించేశా. ఇప్పుడు నా దృష్టంతా రాష్ట్రంపైనా.. నా ప్రజలపైన మాత్రమే ఉంది అంటూ జగన్ తెలిపారు.