రెమ్ డెసివిర్ సప్లయర్ ని పోలీసులు వేధిస్తున్నారు, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం

| Edited By: Phani CH

Apr 18, 2021 | 2:33 PM

రాష్ట్రంలో ఓ వైపు కోవిడ్ కేసులు పెరిగిపోతుండగా మరో వైపు ఈ రోగుల చికిత్సలో వాడే రెమ్ డెసివిర్   మెడిసిన్ ని పంపిణీ చేసే ఓ ఫార్మా కంపెనీ అధినేతను పోలీసులు వేధిస్తున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు.

రెమ్ డెసివిర్ సప్లయర్ ని పోలీసులు వేధిస్తున్నారు, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం
Devendra Fadnavis
Follow us on

రాష్ట్రంలో ఓ వైపు కోవిడ్ కేసులు పెరిగిపోతుండగా మరో వైపు ఈ రోగుల చికిత్సలో వాడే రెమ్ డెసివిర్   మెడిసిన్ ని పంపిణీ చేసే ఓ ఫార్మా కంపెనీ అధినేతను పోలీసులు వేధిస్తున్నారని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు. ఈ సంస్థకు చెందిన డైరెక్టర్ ను ఇటీవల వారు పిలిపించి ఈ మందును  నిర్ణీత నిల్వకన్నా ఎక్కువగా స్టోర్ చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు  అందాయని, దీంతో తగిన డాక్యుమెంట్లను చూపాలని ఆదేశించారని ఆయన తెలిపారు. అయితే తమ సంస్థ వద్ద 60 వేల వైల్స్ ఉన్నాయంటూ ఆ డైరెక్టర్ తగిన డాక్యుమెంట్లను చూపడంతో పోలీసులు ఆయనను వదిలివేసినట్టు తెలిసిందన్నారు. ఇది వేధింపులు కాక మరేమిటన్నారు. కరోనా వైరస్ రోగుల చికిత్సలో వినియోగించే ఈ మందుకు దేశంలో కొరత ఏర్పడింది. ఈ మెడిసిన్ తాలూకు నిల్వలను అధికమొత్తంలో ఉంచుకుని కొన్ని సంస్థలు బ్లాక్  మార్కెటింగ్ కి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. కాగా కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు.  ఈ  మందును యుధ్ధ ప్రాతిపదికన సప్లయ్ చేయాలని   నాలుగు  రోజుల క్రితం తాను బ్రక్ ఫార్మా కంపెనీని కోరానని, కానీ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప తాము దీన్ని సప్లయ్ చేయలేమని ఆ సంస్థ చేతులెత్తేసిందని, దాంతో తను కేంద్ర మంత్రి  మాన్ సుఖ్ మాండవీయతో ఫోన్ లో మాట్లాడానని ఆయన చెప్పారు. ఆ తరువాతే ఈ మెడిసిన్ ను  విడుదల చేశారన్నారు.

ప్రతిపక్షాలు కోరితేనే మీరు రెమ్ డిసివిర్ మెడిసిన్ ను పంపిణీ చేస్తారా అని పోలీసులు, ప్రభుత్వం కూడా ఈ సంస్థ డైరెక్టర్ ను ప్రశ్నించినట్టు తనకు తెలిసిందని ఫడ్నవిస్ వెల్లడించారు. మంత్రి నవాబ్ మాలిక్,  మరికొందరికి కరోనా రోగుల పట్ల శ్రధ్ద లేదని, పాలిటిక్స్ పైనే వారికి ఆసక్తి అని ఆయన ఆరోపించారు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: Indian Navy Recruitment 2021: ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తులు ఎప్పటి నుంచంటే..

Sanjay Gaikwad: ‘కరోనావైరస్‌ దొరికితే.. ఆయన నోట్లో వేస్తా’.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..