రాపోలు ఆనంద్ భాస్కర్…కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి

కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదగదని ఆయన‌ తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న తనలాంటి వారిని పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లేఖను ఏఐసీసీకి పంపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరనున్నారు. రాపోలు ఆనంద్ భాస్కర్ […]

రాపోలు ఆనంద్ భాస్కర్...కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి

Updated on: Apr 04, 2019 | 11:52 AM

కాంగ్రెస్‌ పార్టీపై ఆ పార్టీ మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ ఎదగదని ఆయన‌ తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న తనలాంటి వారిని పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లేఖను ఏఐసీసీకి పంపారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాపోలు ఆనంద్ భాస్కర్ బీజేపీలో చేరనున్నారు.

రాపోలు ఆనంద్ భాస్కర్ 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్… ఎవరూ ఊహించని విధంగా ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. అయితే గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి కాంగ్రెస్ సీటును ఆశించిన రాపోలు… ఇందుకోసం హైకమాండ్ పెద్దలను రిక్వెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆయన వినతిని పట్టించుకోలేదు. అప్పటినుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న రాపోలు ఆనంద్ భాస్కర్… ఎట్టకేలకు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us