అన్నా..! నువ్వు పీఎం కాలేవన్నా.. ఇది నా మాట..

| Edited By:

Apr 19, 2019 | 3:34 PM

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సోదరుడు వరుణ్ గాంధీ. మరో ఇరవై సంవత్సరాలైన రాహుల్ ప్రధాని కాలేరని ఆయన అన్నారు. పిలిభిత్ లోక్‌సభ నుంచి వరుణ్ గాంధీ బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ప్రధాని మోదీకి సరితూగే నాయకుడే లేరని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. సాధారణంగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలపై ఎన్నడూ విమర్శలు చేయని వరుణ్ గాంధీ..  మొట్టమొదటి సారి […]

అన్నా..! నువ్వు పీఎం కాలేవన్నా..  ఇది నా మాట..
Follow us on

ఉత్తరప్రదేశ్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సోదరుడు వరుణ్ గాంధీ. మరో ఇరవై సంవత్సరాలైన రాహుల్ ప్రధాని కాలేరని ఆయన అన్నారు. పిలిభిత్ లోక్‌సభ నుంచి వరుణ్ గాంధీ బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ప్రధాని మోదీకి సరితూగే నాయకుడే లేరని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. సాధారణంగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలపై ఎన్నడూ విమర్శలు చేయని వరుణ్ గాంధీ..  మొట్టమొదటి సారి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. తానేమి సిద్ధాంతిని కాదని, కాని రాహుల్‌కు ప్రధాని అయ్యే అర్హత  ఏమాత్రం లేదని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజలు ఓట్లు మాత్రమే కాదని.. అవసరమైతే వారి రక్తం కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని వరుణ్ గాంధీ అన్నారు.