ఆ నియోజకవర్గంలో…మూడు దశల్లో పోలింగ్

|

Mar 11, 2019 | 9:50 AM

డిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలవబోతోంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా తొలిసారిగా ఈ సీటుకు మూడు దశల్లో ఓటింగ్‌ జరగనుంది. అనంత్‌నాగ్‌ దక్షిణ కశ్మీర్‌ లోయలో ఉంది. ఇక్కడ ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ. భద్రతా సిబ్బందికి పొంచి ఉన్న ముప్పులను దృష్టిలో పెట్టుకొని ఈ స్థానంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సునీల్‌ అరోడా ఆదివారం తెలిపారు. మొత్తం 6 లోక్‌సభ సీట్లున్న జమ్మూకశ్మీర్‌లో 5 దశల్లో పోలింగ్‌ […]

ఆ నియోజకవర్గంలో...మూడు దశల్లో పోలింగ్
Follow us on

డిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ లోక్‌సభ స్థానం ఈ దఫా ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలవబోతోంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా తొలిసారిగా ఈ సీటుకు మూడు దశల్లో ఓటింగ్‌ జరగనుంది. అనంత్‌నాగ్‌ దక్షిణ కశ్మీర్‌ లోయలో ఉంది. ఇక్కడ ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ. భద్రతా సిబ్బందికి పొంచి ఉన్న ముప్పులను దృష్టిలో పెట్టుకొని ఈ స్థానంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సునీల్‌ అరోడా ఆదివారం తెలిపారు. మొత్తం 6 లోక్‌సభ సీట్లున్న జమ్మూకశ్మీర్‌లో 5 దశల్లో పోలింగ్‌ పూర్తవనుంది. మరోవైపు- ఝార్ఖండ్‌(14 సీట్లు), ఒడిశా(21 స్థానాలు)ల్లో ఈ దఫా 4 దశల్లో ఎన్నికలునిర్వహించనున్నారు. గతంలో ఈ రాష్ట్రాల్లో గరిష్ఠంగా 2 దశల్లోనే పోలింగ్‌ ముగిసేది.