
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.
ఉదయం 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు..: అస్సాం – 12.36 శాతం, బీహార్ – 12.60 శాతం, గోవా – 2.29 శాతం, గుజరాత్ – 1.35శాతం, జమ్ము కశ్మీర్ – 0.00 శాతం, కర్నాటక – 1.75 శాతం, కేరళ – 2.48 శాతం, మహారాష్ట్ర – 0.99 శాతం, ఒడిశా – 1.32శాతం, త్రిపుర – 1.56 శాతం, ఉత్తరప్రదేశ్ – 6.84 శాతం, పశ్చిమ బెంగాల్ – 10.97 శాతం, ఛత్తీస్‌గఢ్ – 2.24 శాతం, దాద్రా నగర్ హవేలి – 0.00 శాతం, డయ్యు డామన్ – 5.83శాతం పోలింగ్ నమోదైంది.
#LokSabhaElections2019 Polling percentage recorded in Assam-12.36%, Bihar-12.60%,Goa-2.29%,Guj-1.35%, J&K-0.00%, K’taka-1.75%, Kerala-2.48%, M’rashtra-0.99%, Odisha-1.32%, Tripura-1.56%, UP-6.84%, WB-10.97%, Chhattisgarh-2.24%, Dadra&Nagar Haveli-0.00%, Daman& Diu-5.83%,till 9am pic.twitter.com/zQtTMTohjn
— ANI (@ANI) April 23, 2019