
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తనకు గర్వంగా ఉందని బిజెపి అభ్యర్థి ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. దీనిపై ఒక ఎన్నికల అధికారి ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నివేదికను ఆదేశించారు.
డిసెంబర్ 6, 1992 అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన ఘటనలో తాను ఉన్నానని గత వారంలో ఆమె ప్రముఖ టీవీ చానెల్ టీవీ9 కు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన బిజెపి అభ్యర్థి ప్రగ్యా ఠాకూర్ “మేము దేశం నుండి ఒక మలినాన్ని తొలగించాము, మేము నిర్మాణాన్ని పడగొట్టేందుకు వెళ్ళాము, నేను నిర్మాణం పైకి చేరుకున్నాను, అది విరిచే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను.” అని వివరించారు.
వేర్వేరు మతాల మధ్య పరస్పర ద్వేషం సృష్టించడం అన్న కారణంతో ఆమెకు నోటీసు పంపించారు ఈసీ అధికారులు. కానీ ఆమె “అవును, నేను అక్కడికే వెళ్ళాను, నేను నిర్మాణాన్ని కూల్చివేశాను, అక్కడ రామ మందిరం నిర్మాణంలో సహాయం చేస్తాను, ఆ పనిని ఎవరూ ఆపలేరు” అని స్పష్టం చేశారు.