Andhra Pradesh: స్టేట్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న పీకే టీమ్.. అధికార పార్టీ నేతల్లో టెన్షన్

PK టీమ్ ఎంట్రీ ఇస్తోంది. YCP ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఎలక్షన్లకు మరో రెండున్నరేళ్ల టైమ్‌ ఉండగానే ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్ ఎందుకు వస్తోంది? జగన్ ప్లాన్ ఏంటి?...

Andhra Pradesh: స్టేట్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న పీకే టీమ్.. అధికార పార్టీ నేతల్లో టెన్షన్
Pk Team In Ap
Follow us

|

Updated on: Oct 08, 2021 | 8:54 PM

151 మంది ఎమ్మెల్యేలు. 22 మంది ఎంపీలు. 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది వైసీపీ. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత అంటే..2024లో ఎలక్షన్లు జరుగుతాయి. అధికారాన్ని నిలుపుకోవడం… మళ్లీ అదేస్థాయిలో సీట్లను సాధించడం YCP ముందున్న మెయిన్ టార్గెట్. రాష్ట్రంలో ఇప్పటికే భారీస్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మరి అవి ఓట్లుగా మారుతాయా అన్నది ఒక డౌట్? జనరల్ ఎలక్షన్లలో అనేక అంశాలు ఎఫెక్ట్ చూపుతాయి. అందుకే ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది వైసీపీ హైకమాండ్. అందుకే పీకే టీమ్‌ను సీన్‌లోకి దింపుతోంది. 2019 ఎన్నికల్లోనూ YCP విజయంలో ప్రశాంత్ కిషోర్ టీమ్‌ కీ రోల్‌ పోషించింది.

ప్రస్తుతానికి CM జగన్‌ వరకు క్లీన్‌ ఇమేజ్ ఉంది. కానీ జిల్లాల్లో నేతల మధ్య ఓ రేంజ్‌లో వర్గపోరు ఉంది. ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వంపై ప్రజల ఆలోచన ఏంటి? సంక్షేమ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.! ఈ మూడు అంశాలపైనే PK టీమ్‌ ఫోకస్ ఉంటుందని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం ద్వారా..ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది ఓ అంచనాకు రానున్నారు.

PKటీమ్‌ ఎంట్రీతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. ప్రజాక్షేత్రంలో సర్వేలు మొదలైతే..తమ సీటుకు ఎక్కడ ఎసరస్తుందోనన్న భయం పట్టుకుంది. ఇప్పటి వరకు MLAల పనితీరు ఎలా ఉన్నా సర్దుకుపోయారు. కానీ PK టీమ్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా జగన్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మంది నేతలకు సంబంధించిన పక్కా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర ఉందట.

మొత్తానికి 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలు పెట్టేశారు జగన్. PK టీమ్ ఇచ్చే రిపోర్టుల ఆధారంగానే ఆయన నిర్ణయాలు ఉండనున్నాయి.  అంటే అధికార పార్టీ నేతల తలరాతలను PK టీమ్ డిసైడ్ చేయబోతోందన్నమాట. గెలుపు గుర్రాలకే సీట్లని ఇప్పటికే పార్టీపెద్దలు సంకేతాలిచ్చారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

Also Read: ‘ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు’.. సీఎం జగన్ ఆదేశాలు

‘చీటర్స్’ ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు