రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్

| Edited By:

Mar 19, 2019 | 10:52 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై ఓ స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంటోందని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏయే స్థానాల్లో పోటీ చేసే విషయాన్ని గంట తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా.. మరో స్థానంపై స్పష్టత రావాల్సి […]

రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్
Follow us on

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై ఓ స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుంటోందని పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏయే స్థానాల్లో పోటీ చేసే విషయాన్ని గంట తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు.

అయితే విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుండగా.. మరో స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా పోటీ చేసే విషయంలో పవన్ తన అన్నయ్య చిరంజీవిని అనుసరిస్తున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేశారు. పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేయగా.. తిరుపతిలో మాత్రమే గెలుపొందిన విషయం తెలిసిందే.