పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ విజయనగరం జిల్లాలో తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో పవన్‌ అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు. గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా తెనాలి, […]

పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత

Updated on: Apr 05, 2019 | 7:32 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ విజయనగరం జిల్లాలో తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో పవన్‌ అక్కడ ప్రచారం చేయడంతో ఆయనకు వడదెబ్బ తగిలింది. విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న పవన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు వైద్యులు సూచించారు. గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో గుంటూరు జిల్లా తెనాలి, సత్తెనపల్లిలో రోడ్‌షో, బహిరంగ సభలు రద్దుచేసినట్టు పార్టీ నేతలు వెల్లడించారు. శనివారం నుంచి ఆయన ప్రచారానికి సిద్ధమవుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.