‘కొణిదెల’ బాధ్యత నాదిః పవన్ కళ్యాణ్

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లా కొణిదెలలో ఇవాళ పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఉన్న అనంతపురం, కర్నూలు, చిత్తూరు మరియు కడప జిల్లాలను పదేళ్ల పాటు కరువు జిల్లాలుగా ప్రకటిస్తామని తెలిపారు. దానితో వచ్చే స్పెషల్ గ్రాంట్స్ ను జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తామని ఆయన అన్నారు. అంతేకాదు ‘కొణిదెల’ గ్రామం బాధ్యత తనదేనని చెప్పారు. ఇకపోతే 60 […]

కొణిదెల బాధ్యత నాదిః పవన్ కళ్యాణ్

Edited By:

Updated on: Mar 29, 2019 | 7:12 PM

ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు జిల్లా కొణిదెలలో ఇవాళ పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమలో ఉన్న అనంతపురం, కర్నూలు, చిత్తూరు మరియు కడప జిల్లాలను పదేళ్ల పాటు కరువు జిల్లాలుగా ప్రకటిస్తామని తెలిపారు. దానితో వచ్చే స్పెషల్ గ్రాంట్స్ ను జిల్లా అభివృద్ధికి ఉపయోగిస్తామని ఆయన అన్నారు. అంతేకాదు ‘కొణిదెల’ గ్రామం బాధ్యత తనదేనని చెప్పారు. ఇకపోతే 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకూ నెలకు 5 వేలు పింఛన్ ఇస్తామని పవన్ హామీ ఇచ్చారు.