ఈసీని కలవనున్న విపక్షనేతలు..!

| Edited By:

May 21, 2019 | 10:44 AM

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్‌తో ఎన్డీఏ పక్షాలు సంబరాలకు సిద్ధమవుతుంటే.. ఎన్డీయేతర పక్షాలు మాత్రం సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా వీవీప్యాట్ల లెక్కింపుపై ఎన్డీయేతర పక్షాలన్నీ దృష్టి పెట్టాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏకు అన్ని సర్వేలు జై కొట్టినా.. ఎవ్వరి మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పే పరిస్థితి మాత్రం లేదనే తేల్చేశాయి. దీంతో ఎన్డీయేతర పక్షాలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 21 విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఇవాళ ఈసీని […]

ఈసీని కలవనున్న విపక్షనేతలు..!
Follow us on

ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన జోష్‌తో ఎన్డీఏ పక్షాలు సంబరాలకు సిద్ధమవుతుంటే.. ఎన్డీయేతర పక్షాలు మాత్రం సమరానికి సై అంటున్నాయి. ముఖ్యంగా వీవీప్యాట్ల లెక్కింపుపై ఎన్డీయేతర పక్షాలన్నీ దృష్టి పెట్టాయి. ఎగ్జిట్‌పోల్స్‌లో ఎన్డీఏకు అన్ని సర్వేలు జై కొట్టినా.. ఎవ్వరి మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పే పరిస్థితి మాత్రం లేదనే తేల్చేశాయి. దీంతో ఎన్డీయేతర పక్షాలన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 21 విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఇవాళ ఈసీని కలవనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని సీఈసీకి విజ్ఞప్తి చేయనున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై మార్గదర్శకాల కోసం ఈసీకి వినతి పత్రం అందజేయనున్నారు. ఈసీ స్పందన బట్టి అవసరమైతే హస్తిన వేదికగా విపక్ష నేతలంతా ధర్నాకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.