గంటా.. అవంతి.. మధ్యలో నారాయణ.. పాత మిత్రులను కలిపిన స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం.. సీన్‌ భలే ఉందంటూ కామెంట్లు

|

Feb 12, 2021 | 12:56 PM

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమ వేదికపై ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గతంలో మిత్రులుగా ఉన్న ప్రస్తుత ప్రత్యర్థి పార్టీల నేతలు..

గంటా.. అవంతి.. మధ్యలో నారాయణ.. పాత మిత్రులను కలిపిన స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం.. సీన్‌ భలే ఉందంటూ కామెంట్లు
Follow us on

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమ వేదికపై ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. గతంలో మిత్రులుగా ఉన్న ప్రస్తుత ప్రత్యర్థి పార్టీల నేతలు మళ్లీ కలిశారు. ఒకే వేదికపైకి వచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం వారిద్దరినీ కలిపింది. గంటా, అవంతి… మధ్యలో నారాయణ. ఈ సీన్‌ కొన్ని సెకన్లపాటే కనిపించింది. కానీ కొత్త చర్చక దారితీసింది.

2019 ఎన్నికలకు ముందు వరకు… TDPలోనే ఉన్నారు గంటా, అవంతి. మంత్రిగా గంటా, ఎంపీగా అవంతి కొనసాగారు. ఎన్నికలకు ముందు అవంతి వైసీపీలోకి వచ్చి మంత్రి అయ్యారు. ఆ తర్వాత… గంటా వైసీపీలోకి రావడానికి ప్రయత్నించినా… అవంతి వ్యతిరేకించారు. బహిరంగంగానే వ్యతిరేకించారు. కారణాలు ఏమైనా కానీ గంటా వైసీపీలోకి వెళ్లడం ఆగిపోయింది.

టీడీపీలో ఉన్నప్పుడు మిత్రులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఇప్పుడు రాజకీయ విభేదాలు వచ్చాయి. పైగా పార్టీలు వేరు. ఇన్నాళ్లు ఎక్కడా ఎదురుపడని గంటా, అవంతి… ఒకే వేదికపైకి రావడం ఆసక్తిగా మారింది. స్టీల్‌ ప్టాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఏర్పాటు చేసిన సభకు వచ్చారు వీరిద్దరు. మధ్యలో సీపీఐ నారాయణ వచ్చి… వీరిద్దరూ మిత్రులు అంటూ చేయి చేయి కలిపే ప్రయత్నం చేశారు.

 

Read more:

పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేత నిర్ణయాన్ని స్వాగతించిన షూటర్లు.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు సుముఖత