ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే.. సంచలనంగా మారిన వైస్‌ ఛాన్సలర్‌ కామెంట్స్‌

|

Feb 19, 2021 | 6:07 PM

ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే...! అవినీతి లేనిది ఎక్కడ... ప్రతి చోటా ఉంది..? ఇవి ఎవరో వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు కాదు. ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన ప్రశంసలు అంతకన్నా కాదు..

ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే.. సంచలనంగా మారిన వైస్‌ ఛాన్సలర్‌ కామెంట్స్‌
Follow us on

ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే…! అవినీతి లేనిది ఎక్కడ… ప్రతి చోటా ఉంది..? ఇవి ఎవరో వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు కాదు. ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన ప్రశంసలు అంతకన్నా కాదు. స్వయంగా ఎన్టీఆర్ హెల్త్‌ యునివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ శ్యామ్ ప్రసాద్ చెబుతున్న మాటలు. కర్నూల్‌లో సుశ్రుత విగ్రహావిష్కరణకు వచ్చిన వీసీ శ్యామ్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి.

గవర్నమెంట్‌ కొన్ని మంచి పనులు చేస్తున్నపుడు… కొన్ని చెత్త పనులు కూడా జరుగుతుంటాయని నిర్మోహమాటంగా చెప్పేశారు . అవినీతి లేనిది ఎక్కడ అంటూ ప్రశ్నించిన ఆయన… ప్రతీ చోట ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను సీనియర్‌గా ఉండగా దొంగ దారిలో ఇద్దరు డైరెక్టర్లు అయ్యారని ఆరోపించారు. ఈ విషయంలో కోర్టు కూడా తనకు న్యాయం చేయలేకపోయిందన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పని చేసే ఏకైక వీసీని తానేనని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి చాలా తేడాలున్నాయన్నారు వీసి శ్యామ్‌ ప్రసాద్‌. వేల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ.. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ మంచి చేస్తున్నారన్నారు. గతంలో వైద్యారోగ్య శాఖకు 2 శాతం నిధులు కేటాయిస్తే… సీఎం జగన్ హయాంలో 10 శాతం నిధులు ఇస్తున్నారన్నారు. ప్రజా ఆరోగ్యానికి 20 వేల కోట్లు జగన్ హయాంలో మంజూరయ్యాయన్నారు. ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని… రెండోసారి వచ్చినపుడు మేజర్ రేవేల్యూషన్ ఉంటుందన్నారు.

Read more:

స్టీల్‌ ప్లాంట్‌పై కొత్త రాగం అందుకున్న బీజేపీ నేతలు.. ఆ ఇష్యూను పక్క దారి పట్టించేందుకేనన్న సోము వీర్రాజు