ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నీతిఆయోగ్ స్వాగతించింది. ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టనున్న భారత్ నెట్ ప్రాజెక్టును ప్రశంసించింది. ఈ క్రమంలోనే జగన్ చేసిన ట్వీట్‌ను నీతిఆయోగ్ రీట్వీట్ చేసింది.
భారత్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో సీఎం జగన్ తీసుకొస్తున్న పథకాన్ని అభినందించింది. కాగా.. భారత్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో డిజిటల్ పబ్లిక్ లైబ్రరీలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సీఎం జగన్ తన ట్వీట్‌లో తెలిపారు. నిరంతర ఇంటర్నెట్‌ను అందించడం ద్వారా వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ గ్రామస్థాయి నుంచి అమలు చేసేందుకు కృషి చేస్తామని జగన్ తెలిపారు.
ఇక రాష్ట్రం అభివృద్ధి కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలను నీతిఆయోగ్ వరుసగా ట్వీట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ట్వీట్‌ను నీతిఆయోగ్ రీట్వీట్ చేసింది. సీఎం జగన్ నిర్ణయాలకు నీతి ఆయోగ్ ప్రశంసలు బూస్ట్‌లా ఉపయోగపడుతుందని వైసీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి
In line with the vision of the Bharat Net project, we are establishing digital public libraries & bringing the concept of Work from Home closer by providing uninterrupted access to quality internet in every village: @ysjagan, CM, #AndhraPradesh. #SixthGCM pic.twitter.com/p8DKyYuC5x
— NITI Aayog (@NITIAayog) February 20, 2021
Read more:
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రత్యేక హోదీ ఇవ్వాలని కోరిన ఏపీ ముఖ్యమంత్రి