సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

| Edited By:

Mar 07, 2019 | 3:32 PM

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల నియామకాల్లో కొత్త రోస్టర్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు సులభతరం కానుంది. అలాగే ఢిల్లీలో అనధికారిక కాలనీల్లో నివసిస్తున్నవారికి యాజమాన్య హక్కులు కల్పనపై కమిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చక్కెర మిల్లులకు అదనంగా రూ.2790 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే థర్మల్ […]

సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Follow us on

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల నియామకాల్లో కొత్త రోస్టర్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు సులభతరం కానుంది. అలాగే ఢిల్లీలో అనధికారిక కాలనీల్లో నివసిస్తున్నవారికి యాజమాన్య హక్కులు కల్పనపై కమిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చక్కెర మిల్లులకు అదనంగా రూ.2790 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రుల బృం‍దం​చేసిన సిఫార్సులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోద ముద్ర వేసింది.