వాయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి ఈయ‌నే

న్యూఢిల్లీ : కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని ప్రకటించి 24 గంటలైనా గడవక ముందే, ఎన్డీఏ సైతం రాహుల్‌పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన భారత ధర్మ జనసేన తరపున తుషార్ వెల్లప్పల్లిని వాయనాడ్ నుంచి బరిలోకి దింపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తుషార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ కూడా చేశారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎన్డీఏ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని […]

వాయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి ఈయ‌నే

Edited By:

Updated on: Apr 01, 2019 | 10:42 PM

న్యూఢిల్లీ : కేరళలోని వాయనాడ్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని ప్రకటించి 24 గంటలైనా గడవక ముందే, ఎన్డీఏ సైతం రాహుల్‌పై పోటీకి అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైన భారత ధర్మ జనసేన తరపున తుషార్ వెల్లప్పల్లిని వాయనాడ్ నుంచి బరిలోకి దింపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తుషార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ట్వీట్ కూడా చేశారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎన్డీఏ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే అమేథితో పాటు దక్షిణ భారతం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్న రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్‌సభను ఎంపిక చేసుకున్నారు. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీచేయడం ద్వారా రెండు రాష్ట్రాలపై పార్టీ విస్తరణకు బలం చేకూరుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కాగా శబరిమల వివాదం అనంతరం కేరళ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని ఊవిళ్లూరుతున్న బీజేపీ.. ప్రస్తుతం భారత్ ధర్మజనసేనతో జతకట్టి వీలైనన్ని ఎక్కువ స్థానాలు రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వాయనాడ్ సీటును భారత ధర్మ జనసేన పార్టీకి కేటాయించారు. ఇదిలాఉంటే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థానంలో పోటీచేస్తే రాహుల్‌ను ఓడిస్తామని ఇప్పటికే ఎల్డీఎఫ్ నేతలు ప్రకటించారు. మరోవైపు అమేథిలో ఓటమి నుంచి తప్పించుకునేందుకే రాహుల్ వాయనాడ్ పారిపోతున్నారని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.